Kamareddy | కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితం కామారెడ్డి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా, వర్షాకాలం మినహా మిగిలిన అన్ని కాలనీల్లోనూ నీటి ఎద్దడి ఏర్పడేదని అన్నారు. ఆ రోజుల్లో ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపే వారని చెప్పారు.
ఈ నీటి సమస్యను శాశ్వతంగా తీర్చడమే తమ ధ్యేయంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. కామారెడ్డి పట్టణానికి 10 వాటర్ ట్యాంకులు ఉన్నాయని, అమృత్ 2.0 పథకంలో భాగంగా 9 వాటర్ ట్యాంకులు పూర్తయ్యాయని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, డీఈ హనుమంతరావు, ఏఈ వినోద్, కౌన్సిలర్లు వాజిద్, జావేద్, అంజద్, బబ్లు, నాయకులు, కాళ్ల గణేష్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.