MLA Dhanpal Suryanarayana | వినాయక్ నగర్, జూలై 17 : మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత సమాజాన్నిఅందించాలని నిజామాబద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూచించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో సారంగాపూర్ అర్బన్ పార్కులో గురవారం 76వ వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యుడు ధన్ పాల్ సూర్యనారాయణ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులు, ఫారెస్ట్ అధికారులు, ఎమ్మెల్యే అర్బన్ పార్క్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణం అంటేనే భూమి, నీరు, గాలి, చెట్లు, జీవజంతు జాతుల రూపంలో మన చుట్టూ ఉన్న ప్రకృతి అని అన్నారు. మానవ మనుగడకు, అభివృద్ధికి అత్యంత అవశ్యకమని, అటువంటి పర్యావరణం నేడు కాలుష్యం అవుతుందని అన్నారు.
2018 సంవత్సరం ఆగస్టు 15 నుండి 22 వరకు దేశ రాజధాని ఢిల్లీలో 10 లక్షలకు పైగ నీడనిచ్చే, ఔషధ మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు. పట్టణాలలో నానాటికి కాలుష్యం పెరిగిపోతుందని, భవిష్యత్ తరాల మన పిల్లలు బాగుండాలంటే కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించాలన్న మొక్కలు నాటి వాటిని సంరక్షించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎఫ్వో సుధాకర్, ఎఫ్ఆర్ఓ సంజయ్, రవిమోహన్, రాధిక, గ్రీన్ జనార్ధన్, బీజేపీ నాయకులు, అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.