మద్నూర్, జూలై 9: త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే కార్యకర్తలకు సూచించారు. మద్నూర్‌లో బుధవారం నిర్వహించిన ఉమ్మడి మండలాల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికలపై వారికి దిశానిర్దేశం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చి న హామీలను అమలు చేయకుండా ఎలా మోసం చేస్తున్నదో వివరించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. నాయకులు బన్సీ పటేల్, ధనుంజయ్, విజయ్‌కుమార్, గోవింద్, నాగేశ్, హన్మాండ్లు, రవి, తులసీరాం, సుల్తాన్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.