Drinking water | శక్కర్ నగర్ : బోధన్ పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో మున్సిపల్ అధికారులకు సూచించారు. రాకాసిపేటలోని వాటర్ వర్క్స్ ను ఆయన మున్సిపల్ అధికారులతో కలిసి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వాటర్ బాక్స్ లోని నీటి పారిశుధ్యాన్ని, బెల్లాల్ చెరువు నుంచి నిత్యం వినియోగిస్తున్న నీటి వివరాలు ఆయన మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బెల్లాల్ చెరువులోకి నీటి సరఫరా జరిగే కాలువకు మరమ్మతులు జరిపించాలని మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణకు సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ తో పాటు మున్సిపల్ కమిషనర్, డీఈ యోగేష్, ఏఈ ముఖయ్యర్ సిబ్బంది ఉన్నారు.