Kamareddy | కామారెడ్డి : కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో గెలిచిన నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు తాము ఏ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నామని, కొత మంది సోషల్ మీడియాలో తాము కాంగ్రెస్లో చేరినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచారాలను నమ్మొద్దని ప్రకటించారు. ఈ మేరకు ఆ నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు (18 వ వార్డు కౌన్సిలర్ హఫీజ్ బేగ్, 45వ వార్డ్ కౌన్సిలర్ పిట్ల వేణుగోపాల్, 46వ వార్డ్ కౌన్సిలర్ గరిగంటి లక్ష్మీనారాయణ, 47వ వార్డ్ కౌన్సిలర్ గరిగంటి స్వప్న) కాంగ్రెస్ లో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఖండించారు.
ఈ సందర్భంగా ఆదివారం వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేమని బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తాము ఏ ప్రలోభాలకు లొంగలేదని, తమ అధిష్టానం మేరకే నడుచుకుంటామని ప్రకటించారు. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దిన్, పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.