మోర్తాడ్, ఏప్రిల్ 27: జిల్లాలో శనివారం కురిసిన వర్షానికి ఎస్సారెస్పీలో ఇన్‌ఫ్లో స్వల్పంగా పెరిగింది. ప్రాజెక్ట్‌లోకి 3, 472 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం వరకు 11.335 టీఎంసీలుగా ఉన్న నీటిమట్టం, ఆదివారం 11.545 టీఎంసీలకు చేరింది.
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు(80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1061 అడుగుల (11.545 టీఎంసీలు) నీటినిల్వ ఉంది. కాకతీయ కాలువకు 100, సరస్వతీకాలువకు 300, మిషన్‌భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 382 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వెళ్తున్నదని అధికారులు తెలిపారు.