మాక్లూర్, మే 21: ఇంటిని ఆన్లైన్లో నమోదు చేయడానికి డబ్బులు డిమాండ్ చేసిన మండలంలోని గొట్టుముక్కల గ్రామ పంచాయతీ కార్యదర్శిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఘటనా వివరాలను ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ బుధవారం వెల్లడించారు. గొట్టుముక్కులకు చెందిన ముప్పడి రాజేందర్ తన ఇంటిని ఆన్లైన్లో నమోదు చేయాలని పంచాయతీ కార్యదర్శి కట్కం మోహన్‌ను కోరాడు.
దీనికి పంచాయతీ కార్యదర్శి రూ.25 వేలు లంచం డిమాండ్ చేశాడు. తాను అంతగా ఇచ్చుకోలేనని తగ్గించాలని కోరడంతో రూ.18 వేలకు ఒప్పందం కుదిరింది. ఈమేరకు బుధవారం పంచాయతీ కార్యాలయంలో ఉన్న కార్యదర్శి మోహన్‌కు బాధితుడు రాజేందర్ రూ.18వేలు అందజేస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మోహన్‌పై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.