Village festival | వినాయక్ నగర్, జులై 13 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఊర పండుగకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా చౌరస్తా వద్ద నుండి మొదలయ్యే గ్రామదేవతల ఊరేగింపు (శోభాయాత్ర) ప్రశాంతంగా సాగేందుకు పోలీసులు పటిష్టమైన నిగా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశించారు.
దీంతో ఊర పండుగ శోభయాత్ర సాగే ప్రధాన కూడళ్ల వద్ద పోలీసుల భద్రత తోపాటు ప్రార్థన మందిరాల వద్ద ప్రత్యేక పీకేట్లను ఏర్పాటు చేశారు. ఊర పండుగ శోభయాత్ర బందోబస్తు ఏర్పాట్లను సీపీ స్వయంగా పర్యవేక్షించారు. స్థానిక రఘునాథ ఆలయం ఖిల్లా చౌరస్తా నుండి ప్రారంభమై ఊర పండుగ శోభయాత్ర వివేకానంద చౌరస్తా, పెద్ద బజార్ చౌరస్తా, గాజుల్ పేట, గోల్ హనుమాన్,పులాంగ్ చౌరస్తా,వినాయక నగర్, మహాలక్ష్మి నగర్, దుబ్బ తదితర ప్రాంతాలలో సీపీ పరిశీలిస్తూ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ ఊర పండగ శోభాయాత్ర ప్రారంభం నుండి చివరి వరకు పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతుందని సీపీ పేర్కొన్నారు. ప్రత్యేకంగా సరి తీసుకుని వెళ్ళేటటువంటి ప్రత్యేక ప్రాంతాలలో చుట్టుముట్టు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని సీపీ తెలిపారు. నగరంలోని వివేకనంద చౌరస్తా వద్ద సరి (దేవతల ప్రసాదం) దక్కించుకునేందుకు భక్తులు ఒకరిపై ఒకరు పడడంతో పరిస్థితి చెయ్యి దాటే అవకాశం ఉందని పోలీసులు ఈ క్రమంలో సరి కోసం భక్తులు ఒకరిపై ఒకరు పడి తోపులాట రంగంలోకి దిగిన పోలీసులు గొడవలు జరగకుండా జనాలను చదరగొట్టారు.
తాము నిర్దేశించిన గ్రామ దేవతల ఊరేగింపు రూట్ మ్యాప్ ప్రకారంగా శోభయాత్ర నిర్వాహకులు, ప్రజలు పోలీస్ బందోబస్తుకు పూర్తి సహకరిస్తున్నారని సీపీ తెలిపారు. ఈ గ్రామదేవతల ఊరేగింపు శోభయాత్రలో నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం తో పాటు నిజామాబాద్ డివిజన్ పరిధిలోని సీఐలు , ఎస్సైలు, స్పెషల్ పార్టీ సిబ్బంది బందోబస్తు బందోబస్తులో పాల్గొన్నారు.