మోర్తాడ్, మే 4: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన కేంద్రాల్లో ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుతో ఫోన్లో ఆదివారం మాట్లాడారు.
ధాన్యం కొనుగోలుతోపాటు లారీల ద్వారా ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించడంలో జరుగుతున్న జాప్యంపై రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన వేముల.. కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.