Nizamabad | నిజామాబాద్ ఖలీల్‌వాడి, మార్చి 05 : నిజామాబాద్‌లోని జిల్లా వడ్డెర సంఘం భవన స్థలంలో స్వతంత్ర సమరయోధుడు వడ్డె ఓబన్న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం బుధవారం జరిగింది. వడ్డెర లేబర్ కాంట్రాక్ట్ కో ఆపరేటివ్ సొసైటీ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఇవాళ భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా సొఐటీ ప్రధాన కార్యదర్శి అలుకుంట సాయిబాబా మాట్లాడుతూ.. వడ్డెర ఓబన్న గొప్పతనాన్ని అందరికీ చాటిచెప్పాలని సూచించారు. ఆయన్ను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఐకమత్యంగా ఉంటే ఐదనా సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మక్కల గోపాల్, ఉపాధ్యక్షులు శివాజీ, కోశాధికారి శ్రీను, సంయుక్త కార్యదర్శి సాయి కుమార్, డైరెక్టర్లు మహేశ్, వెంకటేశ్, రాజ్ కుమార్, యాదగిరి, ప్రసాద్, చంద్రబాయి, రాములు, రాజు, హన్మంతు, వెంకటి, ఉపేంద్ర, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.