Bajireddy Goverdhan | కోటగిరిలో ఘనంగా ఊర పండగ.. వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
‘పులోరియా.. పులోరియా..’ అంటూ భక్తుల హోరుతో కోటగిరి మండల కేంద్రం పూనితమైంది. పోతరాజుల చిందులు, శివసత్తుల పూనకాలు, తొట్టేల ఊరేగింపుతో సందడి నెలకొంది. కోటగిరి మండల కేంద్రంలోఊర పండుగను పురస్కరించుకొని కోటగిరి శుక్రవారం జన సంద్రంగా మారింది.
Bajireddy Goverdhan | కోటగిరి , ఆగస్టు 7 : ‘పులోరియా.. పులోరియా..’ అంటూ భక్తుల హోరుతో కోటగిరి మండల కేంద్రం పూనితమైంది. పోతరాజుల చిందులు, శివసత్తుల పూనకాలు, తొట్టేల ఊరేగింపుతో సందడి నెలకొంది. కోటగిరి మండల కేంద్రంలోఊర పండుగను పురస్కరించుకొని కోటగిరి శుక్రవారం జన సంద్రంగా మారింది. ఊర పండగ సందర్భంగా ప్రధానమైన పదార్థం సరిని కోటగిరి వాసులు తమ ఇండ్లు, పొలాల్లో ఎంతో భక్తి ప్రపత్తులతో చల్లుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని కోరుతూ గ్రామ దేవతలకు కోటగిరి వాసులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
కోటగిరి మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఊర పండుగ వేడుకల్లో నిజామాబాదు రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడిపంటలు బాగుండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామాలు జరిగే ఊర పండగ గ్రామ దేవతల జాతర ప్రజల మధ్య ఐక్యత, ప్రకృతి, సంస్కృతిని కాపాడే ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక వేడుక అని గుర్తు చేశారు. వర్షాలు బాగా కురవాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని గ్రామానికి ఎలాంటి రోగాలు, కష్టాలు రాకుండా గ్రామ దేవతలను వేడుకుంటూ ఈ పండుగ జరుపుకుంటారని తెలిపారు.

పలువురి యువకుల బీఆర్ఎస్లో చేరిక
కోటగిరి మండల కేంద్రంలో నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో కోటగిరికి చెందిన పలువురు యువ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ ఆ యువకులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, పార్టీ కోసం ప్రతీ ఒక్కరూ సైనికుడిగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బాన్స్ వాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, రైతుబంధు మాజీ జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, నార్ల రత్న కుమార్, యలమంచిలి శ్రీనివాస్, మోరిల్ శ్రీనివాస్, కోటగిరి మండల నాయకులు తెల్ల రవికుమార్, పోతంగల్ మండల నాయకులు సూధం నవీన్ కుమార్, చందూర్ సర్పంచ్ మాధవరెడ్డి, కప్ప రాజయ్య, కర్నె గజేందర్, కప్ప సంతోష్,శంకర్ గౌడ్, బొట్టే గజేందర్, నజీర్, గంగాప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

