లింగంపేట, ఏప్రిల్ 16: కొన్నిరోజులుగా అకాల వర్షాలు అన్నదాతను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మండలంలోని కోమట్పల్లి, పోతాయిపల్లి గ్రామాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో అరగంటపాటు భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. చేతికి వచ్చిన పంటను అమ్ముకునే సమయంలో అకాల వర్షాలకు తడిసిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.
వర్షానికి తోడు వడగండ్లు కురవడంతో గింజలు రాలిపోతున్నాయిన ఆవేదన వ్యక్తంచేశారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా కాంటా చేయకపోవడంతో ధాన్యం కుప్పలు పేరుకుపోతున్నాయని తెలిపారు. పోతాయిపల్లి గ్రామంలో ఆరబెట్టిన ధాన్యం వరద నీటిలో కోట్టుకుపోగా, కాపాడుకోవడానికి నానా అవస్థలు పడినట్లు రైతులు, మహిళలు తెలిపారు. అధికారులు వెంటనే తూకం ప్రారంభించాలని రైతులు కోరారు.