Unfinished work | పోతంగల్ జూలై 26: వంతెన అసంపూర్తి పనులతో ప్రజల ఇబ్బందులు పడుతున్నారు.మండలంలోని కొల్లూరు-దోమలెడ్జి వెళ్ళే దారిలో వాగు వద్ద వంతెన పనులు నిలిచి పోయాయి. పనులు ప్రారంభించి రెండేండ్లు గడుస్తున్న పిల్లర్ దశలోనే ఉంది. వాహనదారుల రాక పోకల కోరకు పక్కనుండి మొరంతో తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేశారు.
మూడు రోజులుగా కురుస్తున్న వర్షం వల్ల తాత్కాలిక రోడ్డుపై నుండి నీరు ప్రవహించడంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. వర్షం పడిన ప్రతీసారి ఇబ్బందులకు గురవుతున్నామని, వంతెన పనులు త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.