వినాయక నగర్(నిజామాబాద్ ): నిజామాబాద్ ప్రొవిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పలు కేసుల్లో సీజ్ చేసిన మత్తు పదార్థాలను గురువారం దహనం (Drugs burnt) చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఆదేశాల మేరకు డ్రగ్ డిస్పోజల్ కమిటీ (Drug Disposal Committee) ఆమోదించిన 154 ఎన్డీపీఎస్ కేసులలో స్వాధీనం చేసుకున్న మత్తు పదార్తాలను జిల్లాలోని జక్రాన్పల్లి మండల పరిధిలో ఉన్న మెడికేర్లో దహనం చేశారు.
వీటి విలువ రూ. 12 కోట్ల 22 వేల ఉంటుందని అధికారులు నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్హెచ్వో దిలీప్ వెల్లడించారు. 1,700.5 కిలోల ఎండు గంజాయి , 64.27కిలోల అల్ఫాజోలం , 72.2 కిలోల డైజోఫాం , గంజాయి మొక్కలను దహనం చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.