వినాయక నగర్ : విక్రయించిన సైకిల్ తాలూకు డబ్బుల విషయంలో ఇరువురి మధ్య కల్లు సీసాతో దాడి ( Attack ) జరగడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. నిజామాబాద్ ( Nizamabad ) వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి ( SHO Raghupati) తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నగరంలోని అబీబ్ నగర్‌కు చెందిన మహమ్మద్ అనే వ్యక్తి మహేష్‌కు సైకిల్‌ను విక్రయించాడు. ఇందుకు సంబంధించిన రూ. 500 లు బాకీ ఉండడంతో మహమ్మద్ మహేశ్‌ను నిలదీశాడు. ఆదివారం నగరంలోని మిర్చి కంపౌండ్ వద్ద ఇద్దరు కలుసుకోగా రూ. 500ను చెల్లించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
మహమ్మద్ పక్కనే ఉన్న కల్లు సీసాను తీసుకొని మహేశ్‌పై దాడి చేసేందుకు యత్నించగా మహేష్ అడ్డుకోగా అతడి చేతికి గాయమైందని ఎస్‌హెచ్‌వో తెలిపారు. ఈ పెనుగులాటలో మహమ్మద్‌కు కడుపులో గాయం సైతం అయ్యిందని వివరించారు. గాయపడ్డ ఇరువురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, ఇరువురి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.