Nizamabad | వినాయక్ నగర్, అక్టోబర్ 17 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత మూడు రోజుల క్రితం ఓకే కుటుంబానికి చెందిన భార్యా,భర్త, కొడుకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. గత మూడు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ ప్రాంతానికి చెందిన దాసరి కిషన్ (68), భార్య దాసరి నాగమణి, కుమారుడు దాసరి వంశీ(30) కుటుంబ కలహాల కారణంగా తమ ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు వెతికించిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో తీవ్ర అస్వస్థకు గురైన ముగ్గురిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అందులో ట్రీట్మెంట్ పొందుతున్న దాసరి కిషన్ మరణించాడు. అతడి భార్య నాగమణి కొడుకు వంశీ పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న తల్లి కొడుకుల్లో దాసరి వంశీ గురువారం మరణించాడు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒకేసారి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ఎక్కించిన ఘటన కళకళం సృష్టించి స్థానికుల హృదయాలను కలచివేసింది. ఈ ఘటనలో తండ్రి కొడుకు ఇద్దరు మరణించడం, తల్లి ఆరోగ్య పరిస్థితి సైతం విషమంగా ఉండడం వారి కుటుంబంలో తీవ్ర విషాదం మిగిల్చింది. మొన్న తండ్రి, నిన్న కొడుకు వృత్తువాత పడడంతో తల్లి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతునడంతో వారి చిన్న కుమారుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు.