Sirikonda | సిరికొండ, మార్చి 31 : బ్రిటీష్ సామ్రాజ్య వాదాన్ని గడగడ లాడించిన విరయోధులు షహీద్ సర్దార్ భగత్ సింగ్-రాజ్ గురు-సుఖ్ దేవ్ల వర్ధంతి వారోత్సవాల్లో భాగంగా సీపీఐ(ఎం ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో 95వ వర్ధంతి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో సభను నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాండిల్స్ వెలిగించి ఘనంగా నివాళులు ఆర్పించారు.
ఈ సందర్భంగా పీ రామకృష్ణ మాట్లాడుతూ బ్రిటీష్ పాలకులు భారతీయ ప్రజల్ని అనేక చిత్రహింసల పాలు చేసి, ప్రజలను బానిసలుగా చేసుకొని, దేశ సంపదను సర్వం కొల్లగొట్టుక పోతుంటే చూసి సహించలేని కామ్రేడ్స్ సర్దార్ షహీద్ భగత్ సింగ్, రాజు గురు, సుకుదేవులు చలించిపోయి వీరత్వం తో బ్రిటిష్ సామ్రాజ్యవాదం వ్యతిరేకంగా విరోచితమైన పోరాటం చేశారన్నారు. చిన్నతనం నుండే భగత్ సింగ్ తన కుటుంబ వారసత్వంగా విప్లవోద్యమలను విప్లవ పోరాటాన్ని అలవర్చుకున్నారన్నారు.
పోరాటాన్ని నిలువెత్తుతున్న నిలుపుకున్న కామ్రేడ్స్ ముగ్గురు సాహోసపేతమైనటువంటి ఉద్యమాలను పోరాటాలను స్ఫూర్తి గా తీసుకొని ముందు భాగంలో నిలిచి పోరాటాలు చేశారన్నారు. ఈ కార్యక్రమానికి సీపీఐ (ఎంఎల్ మాస్ లైన్) మండల నాయకుడు ఈ రమేష్ అధ్యక్షత వహించగా జిల్లా నాయకులు రమేష్, డివిజన్ నాయకులు దామోదర్, బీ బాబన్న, సీఎం సాయరెడ్డి, బీ కిషోర్, ఎం అనీష్, మండల నాయకులు ఎస్ కిషోర్, బీ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.