మోర్తాడ్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ (Morthad) మండలం తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident ) అదే గ్రామానికి చెందిన మమ్మద్ సోహెల్, అతని బంధువు సుమేర్ మృతి చెందాడు. మూడు రోజుల క్రితమే సోహెల్ బెహరాన్ ( Beharan) నుంచి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన మూడు రోజులకే మృత్యువు ఒడిని చేరడం తో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మెట్పల్లి మండలం యూసుఫ్ నగర్ గ్రామానికి చెందిన సుమీర్ తన బావ వచ్చాడని ఆదివారం తిమ్మాపూర్ గ్రామానికి రాగా వీరిద్దరూ సోమవారం బైక్ పై వెళుతూ స్తంభానికి ఢీకొని ప్రాణాలు కోల్పోయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.