Nizamabad | వినాయక నగర్, జులై : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి లో బీపీ తో ఒకసారిగా బైక్ పై నుండి కింద పడిపోయాడు. కాగా ఈ ప్రమాదంలో అతడు గాయాల పాలయ్యాడు. ఈ ఘటనను గమనించిన అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ సంజీవ్ సకాలంలో స్పందించి క్షతగాత్రుడిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాడు.
ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డు వద్ద శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నగర శివారులోని కాంటేశ్వర్ బైపాస్ సర్కిల్ వద్ద ఒక వ్యక్తి బీపీ తక్కువై, పక్షవాతం వచ్చి రోడ్డుపై పడి గాయాలపాలయ్యాడు. వెంటనే అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హెచ్ సి సంజీవ్ వెంటనే స్పందించి అతనికి సపర్యలు చేసి అందుబాటులో గల ఆర్ఎంపీ వైద్యుడి వద్ద ప్రథమ చికిత్స చేయించాడు.
అనంతరం అతడి సూచన మేరకు అంబులెన్సు పిలిపించి హాస్పిటల్ పంపి మనవత్వం చాటుకున్నాడు. విధినిర్వణంలో ఉన్న సమయంలో ప్రమాదానికి గురైన వ్యక్తికి సాయమందించిన సదరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ సంజీవ్ ను స్థానికుల తో పాటు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సీఐ ప్రసాద్ అభినందించారు.