Pandamadugu | సిరికొండ, మార్చి 27 : సిరికొండ మండలంలోని పందిమడుగు గ్రామానికి చెందిన రవి ట్రాక్టర్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. రవి రోజు లాగానే గురువారం సాయంత్రం తన పొలం వద్ద టాక్టర్ ఉంచి ఇంటికి వచ్చాడు.
శుక్రవారం ఉదయం 4 గంటల సమయంలో ఓ వ్యక్తి పోలాల వద్దకు వెళ్లగా కాలిపోతున్న ట్రాక్టర్ని చూసి రవి కి ఫోన్ చేశాడు. హుటాహుటిన వచ్చి మంటలను నీటితో ఆర్పారు. అప్పటికే ట్రాక్టర్ సగం కాలిపోయింది. దీంతో బాధితుడు రవి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.