TNGO | కంటేశ్వర్, నవంబర్ 12 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయాల సముదాయంలోని విద్యాశాఖ కార్యాలయంలో ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్, కార్యదర్శి శేఖర్ ఆధ్వర్యంలో బుధవారం 2025-26 సంవత్సరానికి టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సుమన్ కుమార్ మాట్లాడుతూ టీఎన్జీవో సభ్యత్వ ప్రాముఖ్యతను తెలియజేస్తూ అన్ని శాఖల ఉద్యోగులు TNGO సభ్యత్వాన్ని స్వీకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ఉపాధ్యక్షుడు శివకుమార్, సంయుక్త కార్యదర్శి జాఫర్ హుస్సేన్, టీఎన్జీవో అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, విద్యాశాఖ ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు అన్వేష్, సలహాదారులు వనమాల సుధాకర్, ఉద్యోగులు అధిక సంఖ్యలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.