వినాయక్‌నగర్, ఆగస్టు 21: మురికికాలువలో పడి చిన్నారి గల్లంతైన ఘటన నిజామాబాద్ నగరంలో బుధవారం కలకలం రేపింది. వర్ని రోడ్ పరిధిలోని అటవీశాఖ కార్యాలయ సమీపంలో నివాసముండే పూజమారుతి దంపతుల కూతురు అను(2) ఇంటి ఎదుట ఆడుకుంటున్నది. ఇంట్లో పని ముగించుకొని బయటికి వచ్చిన తల్లి చిన్నారి కోసం వెతకగా కనిపించలేదు.
దీంతో పాప ఇంటి ముందు ఉన్న మురికి కాలువలో పడిపోయినట్లు చుట్టుపక్కల వారికి చెప్పింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారి కోసం మురికి కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు.విషయం తెలుసుకున్న కమిషనర్ మకరంద్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షించారు.