Nizamsagar | నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మహమ్మద్ నగర్ మండల పరిధిలోని సింగీతం రిజర్వాయర్కి ఎగువ భాగం నుంచి 661 క్యూసెక్కుల నీరు ఇన్ప్లోగా వస్తోంది. దీంతో అంతే స్థాయిలో మూడు వరద గేట్ల ద్వారా నీటిని నిజాంసాగర్ ఆయకట్టుకు విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. అలాగే మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 4500 క్యూసెక్కుల ఇన్ఫ్లో ప్రవహిస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టులో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో నిజాంసాగర్ ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.