Marigemma Temple | కోటగిరి, ఆగస్టు 25 : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో మరిగెమ్మ ఆలయ తృతీయ వార్షిక వేడుకలను ఆలయ కమిటీ నిర్వాహకులు సోమవారం ఘనంగా నిర్వహించింది. ఆలయంలో ఉదయం నుంచి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికులు, మండల నాయకులు ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోరే కిషన్, తెల్ల రవికుమార్, కప్ప సంతోష్, చిన్న అరవింద్, రాజు, భూమయ్య, అంబాటి గంగా ప్రసాద్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు కన్నం దావులయ్య, కన్నం సాయిలు, శ్రీకాంత్ , దినేష్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.