Collector Vinay Krishna Reddy | పోతంగల్, అక్టోబర్ 17 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని నిజామాబాద్ కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. పొతంగల్ మండల కేంద్రంలోని సహకార సంఘం సొసైటీని శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను సొసైటి ఇంచార్జీ సీఈఓ శివాజీకి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మిల్లుకు తరలించాలన్నారు.
ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం రైతుల ఖాతాల్లో డబ్బులు తొందరగా జమ చేసేలా చర్యలు తీసు కోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసు కోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, డీసీవో శ్రీనివాస్ రావు, తహసీల్దార్ గంగాధర్, ఎంపీడీవోలు శ్రీనివాస్ రెడ్డి, చందర్, క్లస్టర్ ఆఫీసర్ అంబర్ సింగ్, ఎస్సై మరియా పుష్పకుమారి, ఏవో నిషిత, ప్రత్యేక అధికారి ఎండీ రియాజుద్దీన్, సొసైటీ సిబ్బంది, రైతులు తదితరులు ఉన్నారు.