రాముడు నడయాడిన నేల..
గోదావరి తీరంలో వెలసిన రామాలయాలు తెలుగు రాష్ర్టాల్లో అనేకం ఉన్నాయి. ఉమ్మడి జిల్లా సరిహద్దులోని నందిపేట్ మండలం ఉమ్మెడ, కుస్తాపురం, తడ్పాకల్, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, కందకుర్తి తదితర ప్రాంతాల్లో రాముడు పూజలందుకుంటున్నాడు.
- గోదావరి తీరాన పూజలందుకుంటున్న రామ లింగేశ్వరుడు
గోదావరి తీరంలో వెలసిన రామాలయాలు తెలుగు రాష్ర్టాల్లో అనేకం ఉన్నాయి. ఉమ్మడి జిల్లా సరిహద్దులోని నందిపేట్ మండలం ఉమ్మెడ, కుస్తాపురం, తడ్పాకల్, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, కందకుర్తి తదితర ప్రాంతాల్లో రాముడు పూజలందుకుంటున్నాడు. ఈ తీర ప్రాంతమంతా శ్రీరాముడు నడయాడిన నేలగా చరిత్రకారులు చెబుతారు. వనవాసం చేసినపుప్పుడు సీత కోసం అన్వేషిస్తుండగా శ్రీరాముడు కాలినడకన తెలంగాణలోని స్థలాలను సందర్శించినట్లు గుర్తించారు.
కుస్తాపురం రామలింగేశ్వరాలయం..
కుస్తాపురం వద్ద ఇసుక శ్రీరాముడు లింగాలను రూపొందించి పూజించినట్లు చెబుతారు. ఇక్కడ నిర్మించిన ఆలయానికి రామలింగేశ్వరాలయం అని పేరు. ఈ మందిరం ఎస్సారెస్పీ ప్రాజెక్టులో ముంపునకు గురైంది. దీంతో ఇక్కడి విగ్రహాలను నది ఒడ్డుకు తరలించి పోచంపాడ్‌లో కోదండ రామాలయాన్ని నిర్మించారు.
తడ్పాకల్ రామాలయం..
తడ్పాకల్ వద్ద కొంత కాలం తాటిపాకను వేసుకుని అందులో సీతమ్మవారిని తలచుకుంటూ ఉన్నాడని ఇతిహాసాల కథనం. తాటిపాక వేసుకుని ఉన్నందున ఇక్కడ ఏర్పడిన ఆవాస ప్రాంతానికి తాటిపాకల అని.. కాలక్రమేణా తడ్పాకల్గా మారిందని స్థానికులు చెబుతారు. ఇక్కడ నిర్మించిన రామాలయం శిథిలావస్థకు చేరడంతో 1990లో మందిరాన్ని పునర్నిర్మించారు.
ఉమ్మెడ ఉమా మహేశ్వరాలయం..
ఉమ్మెడలోని ఉమా మహేశ్వరాలయం, నూత్పల్లి పాత గ్రామంలోని రాజరాజేశ్వరాలయంలోని శివలింగాలకు శ్రీ రాముడు స్వయంగా పూజించినట్లు పూర్వీకులు చెబుతుంటారు. ఈ శివ లింగాలు ఉన్న చోట అప్పటిరాజులు ఆలయాలు నిర్మించారు.
త్రివేణీ సంగమ క్షేత్రం..
కందకుర్తి వద్దనే తెలంగాణలోకి గోదావరి ప్రవేశిస్తుంది. గోదావరి, హరిద్రా, మంజీరా నదులు కలిసే ఈ త్రివేణీ సంగమ క్షేత్రానికి శ్రీ రాముడు వచ్చినట్లు చరిత్ర. కందకుర్తి గోదావరినది తీరాన కొన్ని రోజులు ఉన్నట్లు చెబుతారు. ఇక్కడ నిర్మించిన పురాతన రామాలయంలో ఉత్తర శైలిలో చెక్కిన సీతారామలక్ష్మణ ఆంజనేయ విగ్రహాలున్నాయి. ఆది శంకరాచార్యులు సైతం కందకుర్తి గ్రామాన్ని సందర్శించినట్లు పూర్వీకులు తెలిపారు.
చాలా సంతోషంగా ఉన్నది..
భిక్కనూరు, జనవరి 21: అయోధ్యలో 1990లో నిర్వహించిన శిలన్యాస్లో పాల్గొ న్న. మమ్మల్ని అడ్డుకున్నా అడవిలో నుంచి పొలాల మీదుగా అయోధ్య సరయూ నది వద్దకు చేరుకున్నాం. పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. చాలా మంది కరసేవకులు మృతి చెందారు. కర సేవకుల రక్తం నదిలో ప్రవహించడం చూసి కన్నీళ్లు ఆగలేదు. రామ మందిర నిర్మాణ కల ఇప్పటికి నెరవేరడం చాలా సంతోషకరం.
కరసేవ కోసం అయోధ్య వెళ్లా..
భిక్కనూరు, జనవరి 21: 1992లో నిర్వహించిన కరసేవ కోసం అయోధ్యకు వెళ్లాను. మా గ్రామం నుంచి ఒక్కడినే వెళ్లాను. వివాదాస్పద నిర్మాణాన్ని కూల్చిన రోజు అక్కడే ఉన్నా. పారా మిలటరీ దళాలు అడ్డుకున్నా జై శ్రీరామ్ అంటూ ముందుకు వెళ్లాం.
– రాంరెడ్డి, కరసేవకుడు, ర్యాగట్లపల్లి
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమఆదివారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
విజయ సంకల్పం దసరా సంకేతం..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

