వినాయక నగర్ : నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలోని గాజులుపేట్ ఏరియాలో ఓ తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి బంగారం, నగదు దోచుకు (Theft ) వెళ్లారు. విద్యుత్ శాఖలో లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్న అజిత్ సింగ్ అనే వ్యక్తి మంగళవారం ఇంటికి తాళం వేసి తన కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యానికి వెళ్లాడు.
తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసుకున్న దుండగులు ఇంటి తాళాన్ని ధ్వంసం చేసి లోనికి ప్రవేశించారు. బీరువాను ధ్వంసం చేసి ఐదు తులాల బంగారునగలతో పాటు రూ.85 వేల నగదు దోచుకు వెళ్లారు. బుధవారం ఉదయాన్నే తిరిగి వచ్చిన ఇంటి యజమాని ఇంట్లో దొంగతనం జరిగినట్లుగా గుర్తించి రెండవ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు రెండో టౌన్ ఎస్సై యాసిర్ అరాఫత్ (SI Yasir Arafat) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.