Kotagiri | కోటగిరి, జూన్ 25 : ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని బీఎల్వోలకు కోటగిరి మండల తహసీల్దార్ గంగాధర్ సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా గురువారం నుండి ప్రారంభమైన ఓటరు మ్యాపింగ్ కార్యక్రమాన్ని ఆయన సందర్శించి పలు సూచనలు చేశారు. కోటగిరి మండలంలోని ఏతోండ, యాద్గార్ పూర్, తో పాటు తదితర గ్రామాలలో తిరిగి ఇంటింటా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఓటరు మ్యాపింగ్ కార్యక్రమాన్ని తహసీల్దార్ గంగాధర్ పరిశీలించారు.
ఎన్యూమరేషన్ ఫారాలను ఓట్లకు పంపిణీ చేసే ఒక కుటుంబానికి సంబంధించిన వివరాలు మొబైల్ యాప్ ద్వారా నమోదు చేయాలని సూచించారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. మండలంలో ఉన్న అర్హులైన ప్రతీ ఓటరు తమ వివరాలను సరిచేసుకునే, కొత్త ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే సువర్ణ అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు గైని వీరమణి అర్జున్, శ్వేత సూర్యకాంత్, ఆర్ఐ సునీల్ రెడ్డి, కోటగిరి ఎంపీవో చందర్, కార్యదర్శి తోట ఉదయ బాస్కర్, బీఎల్వోలు పాల్గొన్నారు.