నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 9 : నిజామాబాద్ పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాల వివరాలను సామాజిక మాధ్యమాలు, వెబ్సైట్లో పొందుపర్చామని సీపీ కేఆర్.నాగరాజు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధ న్ డివిజన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్, ఇతర నేరా ల్లో పట్టుబడిన, సీజ్ చేసిన, వదిలి వెళ్లిన వాహనాలు 226 తమ ఆధీనంలో ఉన్నాయని తెలిపారు. సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం సదరు వాహనాలకు 6 నెలల అనంతరం వేలం వేయనున్నట్లు పేర్కొన్నా రు. వాహనాల వివరాలను కమిషనరేట్‌లోని పోలీ స్ లైన్లో ఉంచామని తెలిపారు.
వాహనాల యజమానులు వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు తీసుకువచ్చి నిజామాబాద్ రిజర్వ్ విభా గం (అడ్మిన్) కార్యాలయంలో చూపిస్తే నిబంధనల ప్రకారం వాహనాన్ని ఇస్తామని తెలిపారు. తమ ఆధీనంలో ఉన్న వాహనాల వివరాలను www.ni zamabadpolice.in, https:// twitter. com/ cp_nizamabad, https:// www. face book.com/cp nizamabad అందుబా టులో ఉంచినట్లు వివరించారు. మరిన్ని వివరాలకు రిజర్వ్ విభాగం(అడ్మిన్) అనిల్ కుమార్-87126 59701 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.