ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు మళ్లీ దంచికొడుతున్నాయి. వారం క్రితం చిరుజల్లులతోపాటు మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడ్డది. రెండు రోజుల నుంచి భానుడి ప్రతాపానికి ప్రజలు ఇంటి నుంచి బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. మధ్యాహ్నం వేళ అధిక ఉష్ణోగ్రతలతోపాటు వడగాలులు వీస్తున్నాయి. తీవ్రమైన ఎండకు తోడు ఉక్కపోతకు ప్రజలు అల్లాడిపోతున్నారు.