పెద్ద కొడప్ గల్(పిట్లం) : కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduate MLC Election) ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ( Sub collector Kiranmayi ) సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాలలో ( Polling Centres ) ఓటర్లకు సౌకర్యాలు కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. పట్టుభద్రుల ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ప్రతి పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ వేణుగోపాల్, ఆర్ఐ సీతల్, రెవెన్యూ సిబ్బంది,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.