కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో విఠలేశ్వర మందిరంలో శ్రీమద్ భాగవతం(Srimad Bhagavatam) కథ పురాణం శుక్రవారం ప్రారంభమైంది. శ్రీ సద్గురు గుండా నారాయణ మహారాజ్ సిద్ధారన్ , చక్రినాథ్ మహారాజ్ సిద్ధారన్ ఉద్గిర్ ఆధ్వర్యంలో ప్రవచనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి జీవిత చరిత్ర గురించి భక్తులకు ప్రవచనం చేశారు.
భాగవతం మార్చి ఆరో తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు విఠలేశ్వర మందిరంలో ప్రవచనం కు వచ్చిన భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్ దేశ్ పాండే, దత్తాత్రి కులకర్ణి, అనిల్ కులకర్ణి, రమాకాంత్ కులకర్ణితో పాటు, తదితరులు పాల్గొన్నారు.