kotagiri | కోటగిరి : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బాన్సువాడ నియోజకవర్గం లోని కోటగిరి, పోతంగల్ తో పాటు వివిధ మండలాల నుంచి గులాబీ దండు కదలి రావాలని బాన్స్ వాడ మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ జుబేర్ పిలుపునిచ్చారు. ఈనెల 27న హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తి లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంత చేయాలని కోరుతూ శనివారం కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోరే కిషన్ స్వగృహంలో చలో వరంగల్ గోడ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా షేక్ జుబేర్ మాట్లాడుతూ కేసీఆర్ సారథ్యంలో చేసిన పోరాట ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమని, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోరే కిషన్, మండల నాయకులు ఎత్తోండ దేవేందర్, సూదం నవీన్, సమీర్, గంగాప్రసాద్ గౌడ్, పాల గంగారం, ఏజాజ్ ఆరీప్, యూసుప్, ఉమర్ ఖాన్, మొహమ్మద్ అలీ, అనిల్, సాయి, విగ్నేష్, గణేష్ పాల్గొన్నారు.