మోర్తాడ్, ఏప్రిల్ 29: దొడ్డు రకం వడ్ల కొనుగోళ్లపై అధికార యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం, దొడ్డు వడ్ల సేకరణపై స్తబ్ధత ఏర్పడడం, ప్రభుత్వం పట్టించుకోక పోవడం, మిల్లర్లు దొడ్డు ధాన్యం దించుకోక పోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల ఇబ్బందులపై నమస్తే తెలంగాణ జిల్లా పేజీలో ఈ నెల 26న ‘దొడ్డురకం…రైతుకు నరకం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి అధికారులు స్పందించి దొడ్డు రకం వడ్డను కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతకు ముందు కొనుగోలు చేసిన దొడ్డు వడ్లను రైస్‌మిల్లులకు పంపించిన రైస్‌మిల్లర్లు లారీల్లోనే ధా న్యాన్ని ఉంచడం వాటిని దించుకోకపోవడం ఇప్పటి వరకు జిల్లాలో దాదాపు 300 లారీలు ఖాళీ చేయకుండా ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అధికారులు స్పందించి స మావేశాన్ని ఏర్పాటు చేసి దొడ్డు రకం వడ్లను బాయిల్డ్ రైస్‌మిల్లులకు కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం, అం దుకు రైస్‌మిల్లర్లు అంగీకరించడంతో దొడ్డురకం వడ్ల కొను గోలుకు మంగళవారం సాయంత్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చా రు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో దొడ్డురకం వడ్ల కొనుగోలు ప్రా రంభమైంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం పెట్టిన కొత్త నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులకు అవస్థలు తప్పేలా లేదు. ఇంతకు ముందు రైతులు ధాన్యాన్ని కేంద్రానికి తీసుకురాగానే మ్యాన్వల్ ట్రక్‌షీట్ తయారు చేసి ఆన్లైన్లో నమోదు చేసేవారు. కానీ ప్రస్తుతం కచ్చితంగా ఆన్లైన్లో అప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉంటుంది. రైతుకు వచ్చిన పిన్న ంబర్ చెప్పాల్సి ఉంటుంది. ఈవిధంగా కొన్ని చోట్ల సర్వర్ ప్రాబ్లమ్, సిగ్నల్ సమస్యలతో ఇబ్బందులు తప్పడం లేదని కొనుగోలుదారులు వాపోతున్నారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన తర్వాత ఆన్లైన్లోనే ఏ రైస్‌మిల్లుకు తరలించాలో అలాట్మెంట్ అయిన రైస్మిల్లుకే ధాన్యాన్ని తరలించాలి. ఒకవేళ దూర ప్రాంతపు రైస్‌మిల్లు అలాటయితే అక్కడి వరకు ధాన్యాన్ని తరలించాల్సి ఉంటుంది. గతంలో ఈ విధానం లేదు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రాంతానికి దగ్గరగా ఉన్న రైస్‌మిల్లులకు ధాన్యాన్ని తరలించే వారు. దీంతో సమయం, ఖర్చు ఆదా అయ్యేవి. కానీ ఇప్పుడు ధాన్యాన్ని తరలించే లారీకి జీపీఎస్ విధానాన్ని ఏర్పాటు చేశారు. తప్పనిసరిగా ధాన్యాన్ని తరలించే వాహనం జీపీఎస్ ఏర్పాటు ఉండి తీరాల్సిందే లేకపోతే ఆ లారీలో ధాన్యాన్ని తరలించ బోరు.ఈకారణంగా లారీల కొరత కూడా ఏర్పడే అవకాశం ఉండనున్నది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం కొను గోలు, తరలింపు విషయంలో రైతుకు మేలు చేసేలా ఉన్న క్షేత్రస్థాయిలో సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలను కొనుగోలు దారులు వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే లారీలు రాక కొనుగోలు కేంద్రాల వద్దే ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆన్లైన్ ట్రక్‌షీట్, జీపీఎస్ వాహనంలాంటి నిబంధనలతో ధాన్యం తరలించే విషయాల్లో జాప్యం నెలకొనే అవకాశం ఉన్నది. ఈవిషయంలో అధికారులు వీలైనంత తొందరగా ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
దొడ్డు వడ్లకు కాం టా చేయబోమని చెప్పడంతో పదిరోజుల నుం చి కల్లంలోనే వడ్లను ఉంచి నం. ఇయ్యాల ఏదోరకంగా వైడ్లెతే జోకుతున్నరు. దొడ్డు వడ్లు కొనమంటే సన్నరకం పండి స్తం, అది ముందుగాల్లనే చెప్పాలి గదా. జోకిన వడ్లను తొందరగా మిల్లులకు తరలిస్తే మంచిగుంటది.
– జమీల్, రైతు, కమ్మర్పల్లి
వడ్లు జోకడం పూర్త యి వారం రోజు లు అవుతున్నా లారీలు రాక వడ్లన్నీ కల్లాలకే పరిమితమవుతున్నయి. సన్నవడ్ల పరిస్థితి ఈవిధంగా ఉంటే దొడ్డు వడ్లు ఇంకా కొనడం ప్రారంభించలేదు. ఇప్పటికైనా అధికారులు లారీలను పంపించి సన్న వడ్లు తరలించేలా, దొడ్డు వడ్లు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. రోహిణికార్తె సమీపిస్తుంది. వర్షాలు వస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్న విషయాన్ని అధికారులు గుర్తించాలి.
– బాపురెడ్డి, రైతు, కోనాసముందర్