ముస్లిముల పవిత్ర మాసం రంజాన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నది. గురువారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో 30 రోజులపాటు కఠిన ఉపవాసదీక్షలు చేపట్టనున్నారు.
ప్రత్యేక ప్రార్థనల కోసం మసీదులను అందంగా అలంకరించారు. రంజాన్ మాసం ప్రారంభం కానున్న తరుణంలో ముస్లింలకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
– బీర్కూర్/బాన్సువాడ, మార్చి 23
రంజాన్ వేళలు
ఇఫ్తార్: శుక్రవారం సా. 6.34
సహర్: శనివారం ఉ. 4.54