సంక్రాంతి పండుగ సందర్భంగా శుక్రవారం నుంచి బడులకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. విద్యార్థులు గురువారమే ఇంటిబాట పట్టారు. దీంతో నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ పట్టణాల్లోని బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ నెలకొన్నది. ప్లాట్ఫారాలన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి.