Armur | ఆర్మూర్ టౌన్ : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో జరగనున్న మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల నిమిత్తం వార్డుల వారీగా తుది ఓటరు జాబితా సిద్ధం చేసినట్లు మున్సిపల్ కమిషనర్ పూజారి శ్రావణి తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో తుది జాబితాను సోమవారం ప్రకటించారు.
ఈ సందర్భంగా జాబితాను ప్రజల పరిశీలన కోసం ఆర్మూర్ మున్సిపాలిటీ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయం, ఎంఆర్వో కార్యాలయాల్లో సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. కావున ప్రజలు తమ వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని విజ్ఞప్తి చేశారు.