Nizamabad | పొతంగల్, ఏప్రిల్ 14: పోతంగల్ మండలంలోని కల్లూర్ గ్రామస్తులు 10 రోజుల వయసులో గల జింక పిల్లను ఫారెస్ట్ ఆఫీసర్లకు సోమవారం అప్పగించారు. గ్రామానికి చెందిన రైతులకు వ్యవసాయ పనులు చేస్తుండగా పొలంలో తప్పిపోయి వచ్చిన 10 రోజులు వయస్సు గల జింక పిల్ల కనిపించింది.
కుక్కలు వెంబడించి చంపేస్తాయేమో అన్న ఆలోచనతో ఫారెస్ట్ ఆఫీసర్లకు సమచారం అందించి జింక పిల్ల ను అప్పగించారు. ఆపదలో ఉన్న వన్యప్రాణులను ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకొని కాపాడాలని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సురేష్ అన్నారు. జింక పిల్ల అప్ప చెప్పినందుకు వారికి అభినందించారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు ఉన్నారు.