నిజామాబాద్ టౌన్ : రాష్ట్ర ప్రజానికానికి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Suryanarayana Gupta) పిలుపునిచ్చారు. బుధవారం నిజామాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ( Congress ) కేవలం అధికారం కోసమే ప్రజలను మోసగించి గద్దెనెక్కిందని విమర్శించారు.
నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses) ఇస్తామని చెప్పి దాటవేస్తుందని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడుతానని , సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తానని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, జిల్లా ఇన్చార్జి ఓఎస్ రెడ్డి, బీజేపీ నాయకులు లోక భూపతిరెడ్డి, టక్కరి హనుమంత్ రెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.