Temple land lease | మాచారెడ్డి : మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కు చెందిన వ్యవసాయ భూముల కౌలు కోసం బుధవారం వేలం నిర్వహించారు. వ్యవసాయ భూములను ఒక సంవత్సరం కాలం పాటు కౌలు చేసుకొనుటకు గాను పరిశీలకులు కమల నిజామాబాద్ ఆధ్వర్యంలో బహిరంగ వేలం నిర్వహించారు.
ఈవేలం లో 1)ఈటెల స్వామి తండ్రి రామస్వామి 28 గుంటల భూమిని Rs 6000/-
2) గడ్డం నరసింహారెడ్డి తండ్రి వెంకట్ రెడ్డి 33 గుంటల భూమిని Rs 4600/-
3) మినుకూరి గోపాల్ రెడ్డి తండ్రి నరసింహారెడ్డి ఒక ఎకరం 11 గుంటల భూమిని Rs 10800/
4) సత్యం రెడ్డి తండ్రి వెంకట్ రెడ్డి ఒక ఎకరం 38 గుంటల భూమిని Rs 31200/-లకు దక్కించుకున్నారని ఈవో శ్రీధర్ తెలిపారు. కాగా ఈ వేలంలో మొత్తం Rs 52600/- ఆదాయం వచ్చినట్లు ఈవో వెల్లడించారు. వేలంలో దక్కించుకున్న రైతులు సంవత్సరం పాటు ఆలయ భూముల్లోపంటలు సాగు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ సంతోష్, గ్రామస్తులు పాల్గొన్నారు.