కోటగిరి, జనవరి 18 : టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ప్రజా నాయకుడు అని బీఆర్ఎస్ కోటగిరి మండల నాయకుడు తెల్ల రవికుమార్, కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని మిర్జాపూర్ క్యాంపులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినీ రంగంలో శిఖర స్థాయికి ఎదిగి రాజకీయాల్లో ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారున్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ , కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.