డిచ్పల్ల్లి, ఏప్రిల్ 2: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల అమ్మకాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ యూనివర్సిటీ బంద్ నిర్వహించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి యూనివర్సిటీ మెయిన్ గేట్ వరకు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు శివ మాట్లాడు తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్నదని ఆరోపించారు. విద్యార్థులు, మేధావులు హెచ్‌సీయూ భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి నియంతలా వ్యవహరిస్తూ భూములు అమ్మడం దారుణమన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి కండ్లు తెరిచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, అక్కడున్న వన్యప్రాణులను కాపాడడంతోపాటు యూనివర్సిటీలను గాడి లో పెట్టాలని కోరారు.
ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ అమృతాచారి, టీ యూ శాఖ అధ్యక్షుడు సాయికుమార్ మాట్లాడుతూ.. ప్రభు త్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. యూనివర్సిటీ జాయింట్ సెక్రటరీ సమీర్, అశోక్, అజయ్, అనిల్, పృథ్వీ, రోహన్, నరేందర్, రమణ, ఉదయ్, సాయి, కౌశి క్, అనిల్, విద్యార్థులు పాల్గొన్నారు.