Kotagiri | కోటగిరి, ఏప్రిల్ 27 : తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ మండల నాయకుల తెల్ల రవికుమార్, వల్లేపల్లి శ్రీనివాస రావు, సమీర్ ఆన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందర్భంగా నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల నాయకులు తేళ్ల రవికుమార్, మాజీ వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ 25 వసంతాలు పూర్తిచేసుకుని 26వ వసంతంలో అడుగుపెడుతుందన్నారు.
కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ను స్థాపించారని అన్నారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రతీ ఏటా ఏప్రిల్ 27న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఉమ్మడి కోటగిరి మండలంలోని అన్ని గ్రామాలలో గులాబీ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బొట్టే గజేందర్, నజీర్ ,తెల్ల చిన్న అరవింద్, శ్రీనివాస్ గౌడ్, అంబటి గంగప్రసాద్ గౌడ్, కప్ప సంతోష్, ఫారూఖ్,అశోక్ రెడ్డి, మహేష్ రెడ్డి, యోగేష్, సాయిలు , విజయ్, రవి, రాజు, తోట విజయ్, గంగారం తదితరులు పాల్గొన్నారు.