తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉమ్మడి జిల్లాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహాలు, అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ వేడుకల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాకేంద్రాల్లో నిర్వహించిన వేడుకల్లో ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
కేసీఆర్ జనరంజక పాలనలో చిన్నరాష్ట్రం అయిన తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలో నంబర్‌వన్ రాష్ట్రంగా, జీఎస్డీపీ పెరుగుదలలో దేశంలో మూడోస్థానంలో, విద్యుత్వినియోగంలో నంబర్‌వన్ స్థానంలో నిలిచిందన్నారు. కేసీఆర్ పదేండ్లపాలనలో తెలంగాణను అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదికాలంలో రాష్ర్టాన్ని దేశంలో తలసరి ఆదాయంలో నాల్గో స్థానంలో, జీఎస్డీపీలో 13వ స్థానానికి దిగజార్చిందని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రం తిరోగమనం చెందుతున్నారు. ఎందరో త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ పాలనలో దేశంలో ఉన్నతస్థానంలో ఉంచారని, దిగజార్చవద్దని సూచించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి అయినా దిగజారుడు మాటలు మాట్లాడడం బంద్ చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చేదిశగా పనిచేయాలని కోరారు. అందరం తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.