కామారెడ్డి, జూన్ 4: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మోహన్‌సింగ్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ రాజేశ్ చంద్ర బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మోహన్‌సింగ్ అనైతికంగా ప్రవరిస్తూ.. పోలీసు నియామవళిని ఉల్లంఘించే చర్యలకు పాల్పడుతున్నట్లు అభియోగాలు వచ్చాయి. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో అతడిపై సస్పెన్షన్ వేటు విధించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.