Suicide | ధర్పల్లి, జూన్ 6 : ఇటీవల కరెంట్ షాక్ తో యువకుడు చావు బతుకుల మధ్య పోరాడుతుంటే, అందుకు కారణం నువ్వే అంటూ గ్రామస్తుల వేధింపులు పెరగడంతో ఒకరు శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ధర్పల్లి ఎస్ఐ సందీప్ తెలిపారు. ధర్పల్లి మండలంలోని గోవిందపల్లి గ్రామానికి చెందిన కుంట గంగాధర్ (43) తన పొలం వద్దకు వెళ్ళు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడని ఎస్సై సందీప్ తెలిపారు. గంగాధర్ గ్రామంలో వ్యవసాయ, ఇతర కరెంటు పనులు చేసుకుంటూ జీవనం గడిపేవాడని తెలిపారు.
గత నెల 22న ట్రాన్స్ ఫార్మర్ వద్ద కు సంబంధించి చిన్నపాటి మరమ్మతులు చేస్తుండగా నగేష్ అనే యువకుడు కరంట్ షాక్ తో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇందుకు గంగాధర్ నిర్లక్ష్యం వల్లే యువకుడు చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడని కొందరు గ్రామస్తులు అన్నట్లు తెలిసింది. యువకుడు పరిస్థితి చికిత్సల కోసం చాలా ఖర్చయిందని, ఈ డబ్బులను గంగాధర్ చెల్లించాలని గ్రామస్తులు కొందరు ఒత్తిడి తేవడంతో మానసిక వేదనతో పొలానికి వెళ్లి చెట్టుకి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య వసంత, పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.