హైదరాబాద్, ఆగస్టు 3: రాష్ర్టానికి ప్రముఖ హెల్త్‌కేర్ సేవల సంస్థ కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్స్ సైన్స్స్(కిమ్స్) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.37 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.85 కోట్లతో పోలిస్తే 56 శాతం తగ్గింది. ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 36 శాతం వృద్ధితో రూ.1,196 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఎండీ బీ భాస్కర్ రావు మాట్లాడుతూ..తొలి త్రైమాసికంలో ఆశాజనక పనితీరు కనబరిచినట్టు, ఈ త్రైమాసికంలో కేరళలో మరో ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. దీంతో పడకల సామర్థ్యం 7,459కి చేరుకున్నదన్నారు.
ఎన్టీపీసీతో ఎవ్రీన్ జట్టు
న్యూఢిల్లీ, ఆగస్టు 3: ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీతో ఎవ్రీన్ జట్టుకట్టింది. 750 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాంగా సోలార్, పవన, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాల్లో ఏర్పాటు చేయడానికి మార్గం సులభమైందన్నారు. కంపెనీ చరిత్రలో ఇదొక మైలురాయి వంటిదని, అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు లభించినందకు సంతోషంగా ఉన్నదని కంపెనీ సీఈవో సుమన్ కుమార్ తెలిపారు.