భయాన్ని వీడితే విజయం మీదే
ఈ నెల 14 నుంచి పదో పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం కొన్ని నెలలుగా విద్యార్థులు కష్టపడుతున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు రాత్రింబవళ్లు చదువుతున్నారు. పదో తరగతి పరీక్షలంటే తల్లిదండ్రుల్లోనే కాసింత ఆందోళన నెలకొన్నది.
- పక్కా ప్రణాళికతో చదవాలి
- ‘పది’విద్యార్థులకు విద్యారంగ నిపుణుల సూచన
- సెల్ఫోన్లకు దూరంగా ఉండాలి:వైద్యులు
ఖలీల్‌వాడి మార్చి 12: ఈ నెల 14 నుంచి పదో పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం కొన్ని నెలలుగా విద్యార్థులు కష్టపడుతున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు రాత్రింబవళ్లు చదువుతున్నారు. పదో తరగతి పరీక్షలంటే తల్లిదండ్రుల్లోనే కాసింత ఆందోళన నెలకొన్నది. తమ పిల్లలు మంచి మార్కులు సాధించాలని తాపత్రయపడుతున్నారు. పదో తరగతి పరీక్షలు రాసేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు.
తల్లిదండ్రులు గుర్తించుకోవాల్సినవి..
తల్లిదండ్రులు ర్యాంకులు, పర్సంటేజీల గురించి పదే పదే గుర్తు చేయవద్దు, ధైర్యంగా ప్రోత్సహించాలి కానీ పరుగులు పెట్టించవద్దు. చదువు అనేది శిక్షలా భావించకుండా కేరీర్‌కు తొలిమెట్టుగా పిల్లలు గ్రహించేలా ప్రవర్తించాలి. పిల్లలను గదిలోనికి నెట్టివేసి, డోర్లు మూసి బయటికి రాకుండా చదువుకోవాలని కట్టడి చేయవద్దు. మధ్య మధ్యలో తగిన విశ్రాంతిని కల్పింంచాలి. అంతేగాక సరదగా గడపడం ద్వారా చదువు పై ఆసక్తి పొందే అవకాశాలు ఎక్కువ. అనవసరంగా ఇతరులతో పోల్చి ఇబ్బంది పెట్టరాదు. హాయిగా నిద్ర పోనివ్వాలి. నిద్రలేమి రాత్రులు గడుపకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. వారి ప్రవర్తన వారికి వరంగా ఉండాలని కానీ శాపంగా ఉండకూడదు. ఆహార విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త కొత్త వంటకాల అలవాట్ల జోలికి వెళ్లకూడదు. పరీక్షల ఫలితాలు, పరీక్షల పేపర్లపై చర్చించవద్దు. తల్లిదండ్రులు తమ ఆశయాలను పదే పదే గుర్తు చేస్తూ వాళ్ల లేత మనస్సును గాయపరచవద్దు. విందులు, వినోదాలు లాంటి వాతావరణాన్ని అనవసరంగా కల్పించవద్దు.
విద్యార్థులకు సూచనలు
మీ తల్లిదండ్రులు పడుతున్న తాపత్రయాన్ని టెన్షన్, మీరు ఒత్తిడిగా భావించకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఉత్సహంతో చదివాలే కానీ భయపడి వెనుదిరగవద్దు. ప్రశాంతతను మనసులోకి ఆహ్వానించాలి. మళ్లీ దాన్ని బయటికి నెట్టి వేయకండి. పరీక్షలు విద్యార్థి దశలో భాగమే కానీ దండనగా భావించి ఆందోళనకు గురై బాధపడొద్దు. పరీక్షలను సవాలుగా స్వీకరించి విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్లాలి.
ప్రణాళికతో చదివేలా ప్రోత్సహించాలి
విద్యార్థులు చదువుకునేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్ర శాంత వాతావరణాన్ని కల్పించాలి. విద్యార్థులకు అర్థంకాని సబ్జెక్టులను సంబంధిత ఉపాధ్యాయులతో నివృత్తి కోసం సహకరించాలి. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించాలి. ఉన్న సమయంలో అన్ని సబ్జెక్టులు ఎలా చదవాలో ప్రణాళిక రూపొందించుకునేలా సరైన ప్రణాళికతో చదివేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి.
-అశోక్, జిల్లా విద్యాశాఖాధికారి, నిజామాబాద్
విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దు
పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దు. ర్యాంకులు, జీపీఏ అంటూ వి ద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తే ఆందోళనకు గురై చదివిన పాఠాలను మరిచిపోయే ఆస్కా రం ఉన్నది. వారిపై ఒత్తిడి పెంచకుండా, పట్టు సాధించని సబ్జెక్టులపై నిపుణులైన ఉపాధ్యాయులతో తరగతులు లేదా సందేహాల నివృత్తి చేయించాలి. భయం వీడి పరీక్షలు రాస్తే తప్పక విజయం సాధిస్తారు.
-డాక్టర్ ఆకుల విశాల్, ప్రముఖ మానసిక వైద్యనిపుణుడు
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
Mrunal Thakur | కథలు నచ్చక..కాస్త విరామం..! మృణాల్ ఠాకూర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

