ఖలీల్‌వాడి, డిసెంబర్ 21 : యాసంగి పంటల సాగుకు సంబంధించి రైతుల అవసరాలకు సరిపడా యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులు మార్క్‌ఫెడ్ వద్ద అందుబాటులో ఉన్నాయని జిల్లా సహకార అధికారి సింహాచలం గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా కల్పించారు.
మార్క్‌ఫెడ్‌కు ముందుగానే డబ్బులు చెల్లించి జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లో ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లాలోని అన్ని సహకార సంఘాల కార్యదర్శులను ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని డీసీవో తెలిపారు.