Nizamabad | రుద్రూర్ మే 25: ప్రతీ విద్యార్థి లక్ష్యం తో పని చేస్తే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చు అని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో రైడ్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి ఉచిత తరగతుల ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరిస్థితుల కారణాలకు తలోగ్గకుండా కష్ట పడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకుంటారని అన్నారు. పేద విద్యార్థులను ఆదుకునే దిశగా రైడ్స్ కమిటీ చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. రైడ్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత శిక్షణ తరగతులకు సహకరించిన ప్రతీ ఒక్కరిని అభినందించారు. భవిషత్ లో విద్యార్థులను ఆదుకునే దిశగా రైడ్స్ కమిటీతో పాటు మామిండ్ల ట్రస్ట్ కూడా సహకరిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బోధన్ మేజిస్ట్రేట్ శేషతల్ప సాయి, రైడ్స్ కమిటీ అధ్యక్షులు కృష్ణ, వెంకటేశ్వర్ రావు దేశాయ్, ఇందూర్ సంస్థల అధిపతి కిషోర్, మాజీ సర్పంచ్ శేఖర్, రుద్రూర్, వర్ని meo శ్రీనివాస్, సాయన్న, పాఠశాల ప్రిన్సిపాల్ సంధ్యరాని, పద్మజ, నాయకులు పత్తి రాము, బచ్చు రాములుశేట్, రాంరాజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, రైడ్స్ కమిటీ సభ్యులు ఉన్నారు.